ఇంటెలిజెంట్ పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్Tue,January 17, 2017 01:51 AM

tata
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటెలిజెంట్ సిస్ట మ్స్ పరిశోధనల కేంద్రంగా హైదరాబాద్ ఎదిగేందుకు ఎఫ్‌సీ కోహ్లీ సెంటర్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ మైలురాయిగా నిలుస్తుందని టీసీఎస్ సీఈవో, ఎండీ చంద్రశేఖరన్ అన్నారు. హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో విఖ్యాత ఐటీ నిపుణు డు ఎఫ్‌సీ కోహ్లీ పేరుతో ఏర్పాటు చేసిన కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఐఐఐటీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెస ర్ రాజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే సాంకేతిక విప్లవంలో కీలకంగా మారిన కృతిమ మేధస్సు పరిశోధనల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు.

ఎఫ్‌సీ కోహ్లీ మాట్లాడుతూ పరిశోధన కేంద్రానికి తన పేరు పెట్టడం ఆనందం గా ఉన్నదని చెప్పారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు చెందిన సామాజిక బాధ్యత నిధి(సీఎస్‌ఆర్) ద్వారా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఐఐఐటీ డైరెక్టర్ నారాయణన్, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ రాజన్న, టీసీఎస్ ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి రాజేష్ గోపీనాథన్ పాల్గొన్నారు.

872

More News

VIRAL NEWS