మోడల్ డిగ్రీ కాలేజీల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు


Tue,April 16, 2019 01:22 AM

Integrated BED course in Model Degree Colleges

-2020-21 నుంచి అమలు
-ఉన్నత విద్యాశాఖ అధికారుల సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రయోగాత్మకంగా యూనివర్సిటీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సోమవా రం సచివాలయంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి చెప్పారు. 2020-21 నుంచి ఇది అమలుచేసే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్‌ను ఆయన ఆదేశించారు. రూసా నిధులతో కొనసాగుతున్న నారాయణఖేడ్, లక్సెట్టిపేట్, కల్వకుర్తి వంటి నాలుగు మోడల్ డిగ్రీ కాలేజీల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ప్రవేశ పెట్టాలని సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, సెక్రటరీ ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

82
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles