ఈ సిగరెట్లతోనూ ఇన్‌ఫర్టిలిటీ


Thu,September 12, 2019 02:56 AM

Infertility with these E Cigarettes

ఈ-సిగరెట్లు తాగే మహిళల్లో ఇన్‌ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతాయని, గర్భస్రావమయ్యే అవకాశాలుంటాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తున్నది. ఈ సిగరెట్లు కూడా మామూలు సిగరెట్ల మాదిరిగానే నష్టం కలిగిస్తాయని కొత్త అధ్యయనం ధ్రువపరుస్తున్నది. ఈ-సిగరెట్ల వల్ల సంతాన సామర్థ్యం తగ్గిపోతుందని అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వీర్యకణంతో ఫలదీకరణం చెందిన అండం గర్భసంచి గోడలకు అతుక్కోవడాన్ని పిండస్థాపన అంటారు. ఇలా అతుక్కున్న తర్వాతే అక్కడ క్రమంగా పిండం బిడ్డగా ఎదుగుతుంది. అయితే ఈ-సిగరెట్లు తాగడం వల్ల పిండం గర్భసంచి గోడకు అతుక్కోవడం ఆలస్యమవుతుంది. తద్వారా బిడ్డ ఎదుగుదలపై ప్రభావం ఉంటుంది. గర్భం నిలువకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడినా ఎదిగే పిండంపై దుష్ప్రభావాలు ఉంటాయి. ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు బయటపడ్డాయి. అందుకే మహిళలు మామూలు సిగరెట్లే కాదు, ఈ-సిగరెట్ల జోలికి కూడా పోవద్దని సూచిస్తున్నారు అధ్యయనకారులు డాక్టర్ కెథ్లీన్ కెరోన్.

107
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles