భిన్న సంస్కృతుల సమ్మేళనం భారత్

Fri,November 8, 2019 02:07 AM

-పిల్లలకు ఉన్నత విలువలు నేర్పండి
-అధ్యాపకులతో ముఖాముఖిలో ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: భారతదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనమని ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ అన్నారు. ఇది ఒక ప్రాంతం మాత్రమే కాదని, ఒక ప్రత్యేక ఆత్మీయ వాతావరణమని పేర్కొన్నారు. తాను స్వాతంత్య్రానికి పూర్వం ఇదే దేశంలో పుట్టానని, మళ్లీ ఇక్కడే జన్మించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో రస్కిన్‌బాండ్‌తో చిరస్మరణీయ క్షణాలు అనే పేరిట తెలుగు రాష్ర్టాలకు చెందిన 400 మంది అధ్యాపకులతో ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ రత్నసాగర్ ఆధ్వర్యంలో రచయితతో ముఖాముఖి నిర్వహించారు. రస్కిన్ బాండ్ తన 17 ఏటనే రచయితగా మారారు. ఆయన 500కుపైగా రచనలు చేయగా, వాటి లో చిన్నపిల్లలకు సంబంధించిన రచనలు విస్తృత ప్రాచుర్యం పొందాయి. ఈ సందర్భంగా రస్కిన్ బాండ్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి అనేకమంది తన రంగు గురించి ప్రశ్నించినప్పుడు.. నేను ఎర్రని భారతీయుడిని అని చెప్పేవాడినని గుర్తుచేశారు. పిల్లలకు అధ్యాపకులు ఉన్నత విలువలను నేర్పుతూ గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. చిన్నారులు అడిగిన ప్రశ్నలకు రస్కిన్ బాండ్ ఓపికగా సమాధానం చెప్పారు. తన జీవితంలోని అనేక విషయాలను వారితో సరదాగా పంచుకున్నారు. రత్నసాగర్ పబ్లిషర్ అతియా జైదీ మాట్లాడుతూ.. దేశ వారసత్వ సంప్రదాయ, చారిత్రక సంపద అత్యంత విలువైనదని, భవిష్యత్ తరాలకు గొప్ప విలువలను అందించాలని పేర్కొన్నారు.

127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles