కృష్ణలో పెరిగిన వరద

Sun,October 13, 2019 01:36 AM

-జూరాల ఐదుగేట్లు ఎత్తివేత
-సాగర్ రెండుగేట్లు మూసివేత

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి/అయిజ/నందికొండ/మెండోరా/తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో ప్రాజెక్టులకు వరద కొంతమేర పెరిగింది. వరద క్రమంగా పెరుగడంతో శనివారం సాయంత్రం జూరాల ప్రాజెక్ట్‌లో ఐ దు గేట్లను ఎత్తి 41,386 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్ట్‌లకు కూడా వరద పెరిగింది. ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 42,324 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో నదిలోకి వదులుతున్నారు. నారాణయణఫురకు ఇన్‌ఫ్లో 66,381 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 69,498 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో మూడు స్పిల్‌వే గేట్లను అడుగుమేర ఎత్తి 4,611 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు.

శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో సాగర్ క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదలను శనివారం ఎన్నెస్పీ అధికారులు నిలిపేశారు. శుక్రవారం రెండుగేట్ల ఎత్తగా వాటిని మూసివేశారు. సాగర్‌కు 64,703 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 53,854 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాతున్నది. ఇంకా రెండు అడుగుల (10 టీఎంసీల) వరద నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. ఈ సీజన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 78.842 టీఎంసీల వరద వచ్చింది.

ఎల్‌ఎండీకి జలకళ

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం జలకళను సంతరించుకున్నది. 24 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 20.543 టీఎంసీల నీరు ఉన్నది. గత సంవత్సరం ఇదే సమయానికి 6.643 టీఎంసీలు ఉండగా, ప్రస్తు తం నీటితో నిండుకుండను తలపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి కాకతీయ కాల్వ ద్వారా దిగువకు నీటి ని విడుదల చేయనున్నట్టు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. స్టేజ్-1, 2 పరిధిలోని కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు చెరువులు, కుంటలు నింపేందుకు నీటిని విడుదలచేస్తున్నట్టు పేర్కొన్నారు.

125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles