రోజువారీ కార్మికుల వేతనాలు పెంపు

Wed,September 11, 2019 01:58 AM

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభు త్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న రోజువారీ, ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ కార్మికుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో క్యాజువల్ లేబర్/రోజువారీ కార్మికుల వేతనం రూ.192 నుంచి రూ.300కు, ఫుల్‌టైమ్ కంటింజెంట్/కన్సాలిడేటెడ్ వర్కర్ల వేతనం రూ.5 వేల నుంచి రూ.8 వేలకు పెరుగుతుంది.ఈ పెంపుదల నేటి నుంచే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles