మెట్రో రూట్‌లో తగ్గిన ట్రాఫిక్


Thu,December 7, 2017 09:27 AM

In Metro route reduced traffic

-హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రాథమిక అధ్యయనంలో వెల్లడి..
-బుధవారం మెట్రో ప్రయాణికులు 1.01 లక్షలు
hmrl
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: అంచనాలకు తగ్గట్టే మెట్రోరైలు ప్రారంభమైన మార్గం లో ట్రాఫిక్ తగ్గింది. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమైన వారం రోజుల్లోనే నగరంలో రవాణాపై మెట్రోరైలు ప్రభావం చూపిస్తున్నది. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫి క్ కష్టాలు తగ్గుముఖం పడుతున్నట్టు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలిం ది. రోజుకు లక్ష నుంచి లక్షా యాబైవేల మంది వరకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో రోడ్లపై పడుతున్న భారం తగ్గుతున్నదని, రద్దీ తగ్గి వాహనాలు రయ్‌మంటూ దూసుకుపోతున్నాయని వెల్లడైంది. నవంబర్ 29 నుంచి నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మేర మెట్రోరైలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. సాధారణ రోజుల్లో సగటున 1.5 లక్షల మంది దీనిని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని వాహనాల కదలికలపై హెచ్‌ఎంఆర్‌ఎల్ అధ్యయనం చేపట్టింది. బేగంపేట, ఎస్పీరోడ్ రహదారిలో వాహనాల వేగం పెరిగిందని, పంజాగుట్ట, అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ రోడ్ వరకు వాహనాల రాకపోకల్లో తేడాలున్నాయని ఈ అధ్యయనంలో తేలింది.

స్టీల్ రెయిలింగ్‌తో సత్ఫలితాలు

రైల్వే స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ఏర్పా టు చేసిన స్టీల్ రేయిలింగ్ సత్ఫలితాలిస్తున్నదని అధికారులు చెప్తున్నారు. మెట్రో ప్రయాణికులు స్టేషన్‌లో దిగి ప్రధాన రోడ్లపైకి వెళ్లకుండా నేరుగా ఇతర ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ రెయిలింగ్ దోహదం చేస్తున్నదని చెప్తున్నారు. ఇలా ఏర్పాటు చేయడం మనదగ్గరే ప్రథమమని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోస్టేషన్లను ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలుగా వాడుకోవడం ద్వారా ప్రయాణికులతోపాటు, పాదచారులు నడకమార్గాలను వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లు సైతం పాదచారులు ప్రధాన రోడ్డుమీదికి రాకుండా నివారిస్తున్నాయన్నారు. బుధవారం మెట్రోలో 1.01 లక్షల మంది ప్రయాణించినట్టు తెలిపారు.

6489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS