లైంగికదాడి, హత్య కేసుల్లో వెంటనే తీర్పురావాలి

Thu,December 5, 2019 02:24 AM

-కఠిన చట్టాలు చేసినా నేరాలు తగ్గడంలేదు
-సమాజంలో మార్పుకోసం చర్చ జరుగాలి
-రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: చట్టాలను కఠినతరం చేసినా మహిళలపై లైంగికదాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి కేసుల్లో సత్వర తీర్పులు రాకపోవడమే దీనికి కారణమన్నారు. నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ- సవాళ్లు (దిశా నిర్దేశం) అనే అంశంపై బుధవా రం మఖ్దూంభవన్‌లో సదస్సు నిర్వహించా రు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో జస్టిస్ చలమేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదన్నా రు.

దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే అనేక కేసుల్లో సత్వర తీర్పులు రావడం లేదని చెప్పారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీ ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.. నిందితులను చంపడం, ఉరి తీయడం సమస్యకు పరిష్కా రం కాదన్నారు. సమాజంలో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి జరు గకుండా ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో నిమిషానికి 15 నుం చి 30 మందిపై లైంగికదాడి జరుగుతున్నదని రచయిత్రి ఓల్గా ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.

234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles