ఒక చెట్టు నరికితే ఐదు మొక్కలు నాటాల్సిందే


Wed,June 19, 2019 02:38 AM

If a tree is cut down five plants should be planted

-వాల్టా చట్టం అమలుకు పటిష్ఠ కార్యాచరణ
-జిల్లాలు, డివిజన్లవారీగా నిర్వహణ కమిటీలు ఖరారు
-చెట్ల నరికివేత, బోర్లు వేయడానికి అనుమతి తప్పనిసరి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వాల్టా చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేసేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇకనుంచి ఒక్క చెట్టు నరికితే.. ఐదు మొక్కలు నాటాల్సిందేనని కరాఖండిగా చెప్పనున్నారు. వాల్టా చట్టంలో ప్రభుత్వం ఇటీవలే పలు సవరణలు తీసుకొచ్చింది. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని భావిస్తున్నది. ఇందులోభాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నిర్వహణ కమిటీలను ఖరారుచేశారు. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు కూడా జారీఅయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం ఇకపై ఎవరైనా ఒక చెట్టును నరికితే వాల్టా చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరకవద్దని, చెట్లను నరకాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. చెట్టు నరికినవారు విధిగా ఐదు మొక్కలు ఆ ప్రాంతంలోనే నాటాల్సి ఉంటుంది. దీని పర్యవేక్షణ కూడా సదరు వ్యక్తికే అప్పగించనున్నారు. అదేవిధంగా భూగర్భజలాలను కాపాడేందుకు విచ్చలవిడిగా బోర్లు వేయడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాల్టా చట్టం నిబంధనల ప్రకారం వ్యవసాయ బోర్లు, బావులకు మధ్య వ్యత్యాసాన్ని పాటించాలి. బోరు వేయడానికి సంబంధిత అధికారుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా బోరు వేసినపక్షంలో బోరు లారీని సీజ్‌చేసి చర్యలు తీసుకోనున్నారు.
plants-TRee

జిల్లాస్థాయి నుంచి కమిటీలు

వాల్టా చట్టం అమలుకు జిల్లాస్థాయిలో కలెక్టర్లు ఎక్స్‌అఫీషియో చైర్మన్లుగా వ్యవహరిస్తారు. కమిటీలో ముగ్గురు ఎంపీపీలు, ఇద్దరు జెడ్పీటీసీలు సభ్యులుగా ఉంటారు. వీరిని కలెక్టర్ నియమిస్తారు. వ్యవసాయశాఖ జేడీ, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, భూగర్భగనులశాఖ డీడీ, గ్రౌండ్‌వాటర్ డీడీ, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్, ఐటీడీఏ పీవో లేదా మాడా పీవో, కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఆఫీసర్, డీపీవో, మున్సిపాలిటీల్లో కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో హెచ్‌ఎండీఏ అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల నుంచి ఐదుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉంటారు. రెవెన్యూ డివిజన్లస్థాయిలో ఆర్డీవోలు లేదా సబ్‌కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తారు. డివిజన్‌స్థాయిలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈలు ఎక్స్‌అఫీషియో కన్వీనర్లుగా.. మండలస్థాయిలో తాసీల్దార్లు ఎక్స్‌అఫీషియో చైర్మన్లుగా, ఎంపీడీఓలు వైస్‌చైర్మన్లుగా ఉంటారు.

2208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles