హైదరాబాద్‌లో శారదాపీఠాధిపతులు

Mon,November 11, 2019 01:16 AM

-12 వరకు ధర్మప్రచార యాగం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హిందూ ధర్మ ప్రచారానికి దేశవ్యాప్త పర్యటన చేస్తున్న విశాఖ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆదివారం హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జలవిహార్ రామరాజు స్వగృహంలో వారిద్దరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ ధర్మ ప్రచార పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు రంజిత్‌రెడ్డితోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర అనుగ్రహ భాషణం చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఈ నెల 12 వరకు పీఠాధిపతులు హైదరాబాద్‌లోనే ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వగృహంలో ధర్మ ప్రచార యాగం జరుగుతుందని వెల్లడించారు.

57
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles