సునీతను హతమార్చింది స్నేహితుడే?Fri,February 17, 2017 03:53 AM

sunitha
సిటీ బ్యూరో/హఫీజ్‌పేట్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీ సర్వే నంబర్ 1007 ఖాళీస్థలంలో బుధవారం సునీత (32) అనే యువతిని హత్యచేసి దహనం చేసిన కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మృతురాలు సునీతది సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేటగా గుర్తించారు. ఆమె ఇటీవల అమీర్‌పేటలోని మాన్‌స్టర్.కామ్‌లో ఉద్యోగినిగా చేరారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరిన సునీత అదేరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మాదాపూర్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురయ్యారు. హత్య జరిగే రెండ్రోజుల ముందు సునీత ఆఫీసుకు వెళ్లలేదని దర్యాప్తులో తేలింది. మంగళవారం ఇంటి నుంచి ఆఫీసుకని చెప్పి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. బుధవారం ఉదయం 9 గంటలకు సునీత సోదరుడు నర్సింహ సికింద్రాబాద్ బస్టాప్‌లో వదిలిపెట్టాడు. ఆ తర్వాత సునీత సికింద్రాబాద్ నుంచి హత్యకు గురైన స్థలానికి ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెకు రెండు మొబైల్ నంబర్లు ఉండగా ఓ సిమ్ కార్డులో ఓ స్నేహితుడి మెసేజ్ గుర్తించారు. దీని ఆధారంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.

5764
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS