ఆస్తి కోసం భార్యాకొడుకుల హత్య


Fri,July 12, 2019 01:49 AM

Husband killed wife and his son for property

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: భార్య పేర ఉన్న ఆస్తిని కాజేసేందుకు భార్యాకొడుకులను దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తిలో గురువారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన చింతాకి వెంకట్‌రెడ్డి(32) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో ఎకరం భూమిని అమ్మి జల్సాలకు ఖర్చు పెట్టాడు. మిగిలిన నాలుగు ఎకరాల భూమిని కూడా విక్రయిస్తాడన్న అనుమానంతో వెంకట్‌రెడ్డి భార్య కవిత భూమిని తన పేర మార్పిడి చేసుకున్నది. భూమి అమ్ముదామని వెంకట్‌రెడ్డి కొన్ని రోజులుగా భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యను చంపితే ఆమే పేర ఉన్న నాలుగెకరాల భూమి తనకే దక్కుతుందని భావించిన వెంకట్‌రెడ్డి బుధవారం కవితను హత్య చేశాడు. విషయం ఎవరికైనా చెబుతాడేమోనని నాలుగేళ్ల కొడుకు దినేశ్‌రెడ్డిని హతమార్చి ఇద్దరి మృతదేహాలను ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. నారాయణఖేడ్ డీఎస్పీ సత్యనారాయణరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి, డాగ్ స్కాడ్, క్లూస్‌టీం ద్వారా విచారణ చేపట్టారు.

1401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles