ఉప్పొంగిన కృష్ణమ్మ


Sat,September 14, 2019 02:59 AM

Huge inflow into Nagarjuna Sagar

-శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను ముంచెత్తిన వరద
-సాగర్‌కు రెండున్నర లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-మొత్తం 26 గేట్లు ఎత్తివేత.. సాయంత్రానికి 19కి తగ్గింపు
-శ్రీశైలంలో 10 గేట్ల ద్వారా నీటి విడుదల
-జూరాలకు రెండున్నర లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో
-ఎస్సారెస్పీకి స్వల్పంగా పెరిగిన వరద

హైదరాబాద్/ జోగుళాంబ గద్వాల ప్రతినిధి/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ, నందికొండ/ మెండోరా: కృష్ణమ్మ ఉప్పొంగింది. ఎగువ నుంచి వచ్చిన వరద శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలను ముంచెత్తింది. శుక్రవారం ఎగువ నుంచి వచ్చిన ఇన్‌ఫ్లోలు నాగార్జునసాగర్ అధికారులను ఉరుకులు.. పరుగులు పెట్టించాయి. గురువారం ఇన్ ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఎన్నెస్పీ అధికారులు రాత్రి సమయానికి ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను క్రమంగా మూసివేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి తిరిగి ఇన్‌ఫ్లోలు పెరగడం తో సాగర్ క్రస్ట్ గేట్లను మళ్లీ తెరిచారు. నాలుగు గేట్లతో మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు 24 గేట్లను ఎత్తారు. సాయంత్రానికి వరద ఉధృతి మరింత పెరగడంతో మొత్తం 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రాత్రి 9 గం టల సమయంలో ఇన్‌ఫ్లో తగ్గడంతో 19 గేట్లకు తగ్గించారు.

గురువారం రాత్రి సాగర్‌కు 1.36 లక్షల క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి అంతకంతకూ పెరుగుతూ మధ్యాహ్నం 3 గంటల సమయానికి 3.70 లక్ష ల క్యూసెక్కులకు చేరిం ది. రాత్రికి 2.55 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టులో 589.60 అ డుగుల నీటిమట్టాన్ని ఉం చుతూ.. వచ్చిన జలాలను వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికీ వరద పో టెత్తింది. అటు జూరాల, ఇటు సుంకేశుల నుంచి భారీగా ఇన్‌ఫ్లోలు వచ్చా యి. దీంతో గురువారం రెండు గేట్లద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు శుక్రవారం మరో ఎనిమిది గేట్లు ఎత్తి.. 10 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. ఎగువన ఆల్మట్టి జలాశయానికి ఉదయం రెండు లక్షల క్యూ సెక్కులకుపైగా ఉన్న వరద ఆ తర్వాత 1.67 లక్షల క్యూసెక్కుల స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నది. దీంతో అధికారులు అంతేమేర దిగువకు వదులుతున్నారు.
Nagarjunasagar1
నారాయణపురకు 2 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. నారాయణపురతోపాటు, ఉజ్జయిని నుంచి వస్తున్న జలాలతో జూరాల ఇన్‌ఫ్లో 1.68 లక్షల క్యూసెక్కుల నుంచి 2.53 లక్షల క్యూసెక్కులకు చేరింది. వరద ప్రవాహానికి అనుగుణంగా 20 గేట్ల ద్వారా 2,64,566 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్‌కు 19వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి అవుట్‌ఫ్లో 3,055 క్యూసెక్కులుగా ఉండగా.. లోయర్‌మానేరుకు అంతేస్థాయిలో ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. కడెంకు 972 క్యూసెక్కుల వరద వస్తుంటే.. ఎల్లంపల్లిలో మాత్రం 5,444 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి 35.4 అడుగులుగా ప్రవహిస్తున్నది. తాలిపే రు నుంచి ఐదుగేట్ల ద్వారా 14, 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టుల్లో గరిష్ఠస్థాయి దాటొద్దు

కృష్ణా బేసిన్‌లో భారీస్థాయిలో ఇన్‌ఫ్లోలు నమోదవుతున్న నేపథ్యంలో జలాశయాల్లో గరిష్ఠ స్థాయిలో నీటినిల్వను నిర్వహించవద్దని కృష్ణాబోర్డు తెలుగు రాష్ర్టాలకు సూచించింది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటడం, అంతకుమించి గేట్ల మీదుగా వరద ప్రవహించడం మం చిది కాదని కృష్ణానదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ర్టాలకు లేఖరాసింది. ఇటీవల శ్రీశైలం క్రస్ట్‌గేట్ల మీదుగా జలాలు ప్రవహించిన నేపథ్యంలో బోర్డు ఈ సూచనలు చేసినట్టు తెలిసింది.
Nagarjunasagar2

1626
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles