డబుల్ బెడ్‌రూం ఇండ్లకు హడ్కో అవార్డు


Wed,April 25, 2018 03:23 AM

Hudco Award for Double Bedroom Houses

-వరుసగా రెండోసారి ఎంపిక
-నేడు అవార్డును స్వీకరించనున్న చిత్రా రామచంద్రన్
indrakaran-reddy
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లకు దేశవ్యాప్త గుర్తింపు దక్కింది. వరుసగా రెండో ఏడాది హడ్కో డిజైన్ అవార్డుకు తెలంగాణ గృహనిర్మాణ శాఖ ఎంపికైంది. హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూంలు.. ముందట వరం డా.. ఇలా సౌకర్యవంతంగా నిర్మించిన ఈ ఇండ్లు ప్రముఖుల ప్రశంసలు పొందడమే కాకుండా వరుసగా అవార్డులు గెలుచుకోవడం విశేషం. బుధవారం హడ్కో డిజైన్ -2017, 2018 అవార్డులను ఢిల్లీలోని ఇండియా హెబిటేట్ సెంటర్ స్టెయిన్ ఆడిటోరియంలో కేంద్రమంత్రి హర్దీప్ ఎస్ పూరి అందజేనున్నారు. గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వీటిని స్వీకరించనున్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు కేంద్ర హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ హడ్కో -2018 అవార్డును ప్రకటించింది. ఇండ్ల నిర్మాణాల్లో నాణ్య త, సృజనాత్మకత, పారదర్శకత, చొరవ చూపిస్తున్నందుకు హడ్కో అవార్డులు ఇస్తారు. వరుసగా రెండేండ్లు ఈ అవార్డును మన రాష్ట్రమే దక్కించుకోవడం ఇండ్ల నాణ్యతకు అద్దం పడుతున్నది. ప్రభుత్వం సొంతంగా లబ్ధిదారులపై రూపాయి భారం మోపకుండా వీటిని నిర్మించి ఇస్తున్నది. ఇప్పటివరకు నాణ్యమైన రీతిలో నిర్మాణాలను పూర్తిచేసి 9552 మంది లబ్ధిదారులతో సామూహికంగా గృహప్రవేశాలు చేయించారు.

నిర్మాణాలను పరిశీలించి

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను హడ్కో ప్రతినిధుల బృందం నిశితంగా పరిశీలించింది. నిర్మాణంలో నాణ్యత, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇండ్ల డిజైన్... ఇలా ప్రతీవిభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసింది. ఆయా రాష్ర్టాల్లో కంటే మన దగ్గర ఇండ్ల నిర్మాణాలు అద్భుతంగా ఉండటతో... కేంద్రం నుంచి ఈ అవార్డును ప్రకటించారు.

గ్రేటర్ వరంగల్‌కు..

వరంగల్, నమస్తేతెలంగాణ: చారిత్రక వరంగల్ నగర సిగలో మరో అవార్డు మెరిసింది. ఉత్తమ నివాసయోగ్యమైన నగరం గా గుర్తిస్తూ హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెట్) సంస్థ 2017-18కి గ్రేటర్ వరంగల్‌కు అవార్డును ప్రకటించింది. దేశంలోని అనేక నగరాలు హడ్కో సంస్థ అవార్డుకు పోటీపడ్డాయి. నాన్ సివరేజ్ శానిటేషన్, మానవ మల, మూత్ర వ్యర్థాల శుద్ధీకరణ తదితర అంశాలపై వరంగల్ కార్పొరేషన్ ఫిబ్రవరి 26న డాక్యుమెంటేషన్ సమర్పించింది. తీవ్ర పోటీ మధ్య గ్రేటర్ వరంగల్‌కు హడ్కో అవార్డు దక్కింది. హడ్కో వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 25న అవార్డును అందచేయనున్నట్లు హడ్కో ప్రకటించింది. ఈ మేరకు అవార్డు దక్కించుకున్న వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్‌ను అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీ రావాల్సిందిగా హడ్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవికాంత్‌ను ఆహ్వానించారు. వరంగల్ కార్పొరేషన్‌కు హడ్కో అవార్డు రావడంపై మేయర్ నన్నపునేని ఆనందం వ్యక్తం చేశారు.

మా కృషికి గుర్తింపుగా అవార్డు

నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా సొంతిల్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నది. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మా కృషికి గుర్తింపుగా హడ్కో అవార్డులు దక్కుతున్నాయి.
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట

డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నాం. డబుల్ బెడ్‌రూం ఇండ్లు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రణాళిక, సిబ్బంది కృషితో దేశంలోనే గుర్తింపు పొందుతున్నాం.
- చిత్రా రామచంద్రన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles