పోలీస్ సిబ్బందికి అభినందనలు


Sat,September 14, 2019 02:06 AM

Home Minister Mahmood Ali Praises To DGP Mahender Reddy For Ganesh immersion

-గణేశ్ నిమజ్జనం విజయవంతంపై హోంమంత్రి మహమూద్‌అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రశంసలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గణేశ్ నవ రాత్రులు, నిమజ్జనం శాంతియుత వాతావరణంలో పూర్తిచేయడంలో కీలకంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని హోంమంత్రి మహమూద్‌అలీ అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది రాత్రిపగలనే తేడాలేకుండాశ్రమించి బందోబస్తు నిర్వహించారని శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పండుగలను అధికారికంగా నిర్వహించుకోవడంతోపాటు అభివృద్ధిలో, సంక్షేమంలోనూ తెలంగాణ దూసుకెళ్తున్నదని పేర్కొన్నారు. వినాయకచవితి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను, జిల్లాల పోలీస్‌ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పక్కావ్యూహాలతో గణేశ్ నిమజ్జన ఉత్సవాలను హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేశారంటూ సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 55వేల మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీస్ సిబ్బందితోపాటు ఎక్సైజ్, ఫారెస్ట్, ఎస్పీఎఫ్, ఏపీ పోలీసులు సైతం బందోబస్తు విధుల్లో పాల్గొన్నారన్నారు. పోలీస్ సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ఏపీ పోలీస్ సిబ్బందికి డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles