19 వరకు విద్యాసంస్థలకు సెలవులు

Sun,October 13, 2019 01:28 AM

-ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్నిరకాల విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలతోపాటు యూనివర్సిటీ కళాశాలలకు ఈ నెల 19 వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు రెండో శనివారాల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మెడికల్ కాలేజీలకు సెలవులు వర్తించవని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ప్రభు త్వం పొడిగించిన సెలవురోజుల్లో తరగతులు నిర్వహించవద్దని, ఉత్తర్వులు ఉల్లంఘించే కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.

151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles