భాషా పండితులు, పీఈటీల పదోన్నతులపై జీవో


Sun,February 17, 2019 02:11 AM

 Hike For Govt Employees In Telangana

-10,479 మందికి ప్రమోషన్లు
-ఉపాధ్యాయ సంఘాల హర్షం
-సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ/బషీర్‌బాగ్: భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయు లు 20 ఏండ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించింది. ఇప్పటివరకు గ్రేడ్-2 భాషాపండితులు, పీఈటీలుగా ఉన్నవారంతా ఇకనుం చి గ్రేడ్-1 భాషాపండితులుగా, వ్యాయామ ఉపాధ్యాయులుగా హోదా పొందుతారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం జీవో 15 జారీచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 8,630 మంది భాషాపండితులు, 1,849 మంది పీఈటీలకు పదోన్నతులు లభించాయి. వీరి జీతం స్కేళ్లను రూ. 28,940-78,910 గా నిర్ణయించారు. గతంలోనే 2,487 భాషాపండితులు, 1,047 వ్యాయమ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేసినట్టు జీవోలో పేర్కొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చి తెలుగు భాషకు సీఎం కేసీఆర్ అపూర్వనీరాజనం అందించారని కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేశారు. భాషాపండితులు, పీఈటీల తరఫున సీఎం కేసీఆర్‌కు మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆర్‌యూపీపీ నేతలు ఎండీ అబ్దుల్లా , జగదీశ్, ఎస్ విజయభాస్కర్, హైదరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అమీన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు రుణపడి ఉంటామన్నారు. జీవోజారీపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, ఎస్టీయూ టీఎస్ నేతలు భుజంగరావు, సదానందంగౌడ్, యూటీఎఫ్ నేతలు సీహెచ్ రాములు, చావ రవి, పీఆర్టీయూ తెలంగాణ నేతలు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య, టీఎస్టీయూ రాజిరెడ్డి, టీటీఎఫ్ రఘునందన్ వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తంచేశారు.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles