గాలి వాన బీభత్సం

Thu,April 18, 2019 02:57 AM

-ఏడు జిల్లాల్లో అకాల వర్షం
-పిడుగులు పడి ముగ్గురు మృతి
-గోడకూలి మరొకరు..
-మార్కెట్లలో తడిసిన ధాన్యం
-రాలిన మామిడి.. రోడ్లపై నేలకొరిగిన చెట్లు
-తడిసిన ధాన్యం కొంటాం: మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి భరోసా

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ద్రోణి ప్రభావంతో బుధవారం పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షం రైతులను ఇబ్బందులకు గురిచేసింది. చేతికొచ్చిన పంటను నేలపాలుచేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. నల్లగొండ, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలో గోడకూలి ఒక రు మృతిచెందగా, పలు ప్రాంతాల్లో మరికొంత మంది క్షతగాత్రులయ్యారు. అకాల వర్షానికి పాడిగేదెలు, కోళ్లు మృత్యువాతపడ్డాయి. నల్లగొం డ, మునుగో డు, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. కట్టంగూర్‌ మండలం మునుకుంట్ల గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పిడుగుపడటంతో కురుమర్తికి చెందిన రైతు రాణి(32) మృతి చెందింది. చం డూరులో వడగండ్లు పడగా.. నిడమనూరులో ఈదురుగాలులతో వర్షం పడింది. కనగల్‌, చిట్యా ల, కట్టంగూర్‌, నల్లగొండ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిసింది.

పెద్దపల్లి జిల్లాలో కూలిన స్తంభాలు

పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలుల కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి మండలం మూలసాలకు చెందిన గొర్రెలకాపరి అజయ్‌(24) పిడుగుపాటుతో మృతిచెందగా, మరోవ్యక్తికి తీవ్ర గా యాలయ్యాయి. సుల్తానాబాద్‌ మండలం సుద్దాలలో ఈదురు గాలులకు గోడకూలి భాగ్యమ్మ (50) మృతిచెందింది. సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు, సుల్తానాబాద్‌లో ఇంటిపైకప్పుకూలగా రాజమ్మకు తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో ఈదు రు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలు గ్రామా ల్లో మక్కజొన్న, వరి పంటలు నేలరాలగా, మామిడికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఓదెల మండలంలో 50 కరెంట్‌ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
Vari
మంథని, రామగిరి, ముత్తా రం, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు తరలించిన వడ్లు తడవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రామగిరిలోని మంథని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఈవీఎంలకు సంబంధించిన స్ట్రాంగ్‌రూం లోపల గల కిటికీని మూసివేసేందు కు తాత్కాలికంగా నిర్మించిన గోడ కొంతమేర కూలినట్లు తెలిసింది. కలెక్టర్‌ దేవసేన, జేసీ వనజాదేవి సందర్శించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌లో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతు సమ్మయ్య (55) పిడుగుపడి మృతిచెందాడు. పలుచోట్ల పిడుగులు పడటంతో పశువులు మృత్యువాతపడ్డాయి. తిమ్మాపూర్‌, శంకరపట్నం, సైదాపూర్‌, వీణవంక, మానకొండూర్‌ మండలాల్లో వరికి నష్టం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం, భీమారంతోపాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. మామిడి కాయలు నేలరాలాయి.
Kolapatam

జనగామలో తడిసిన ధాన్యం

జనగామ మార్కెట్‌ యార్డులో వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దవ్వగా, ఆరబెట్టిన ధాన్యం వరదనీటి పాలైంది. పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లో మా మిడి, వరి పంటలకు తీవ్రనష్టం జరిగింది. పిడుగులుపడి పలు గ్రామాల్లోని ఇండ్లల్లో విద్యుత్‌ పరికరాలు కాలిపోయాయి. హుస్నాబాద్‌ మార్కెట్‌లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసింది. మద్దూరు మండలం బెక్కల్‌లో పిడుగుపాటుకు 12 మేకలు మృతిచెందగా, కోహెడ మండలం బస్వాపూర్‌లో పిడుగుపడి కొబ్బరిచెట్టు తగులబడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన, ఈదురుగాలులతో మామిడి, బత్తాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సంస్థాన్‌నారాయణపురం మండలం అల్లందేవిచెరువులో పిడుగుపడి రైతు సర్వి నర్సింహగౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జైకేసారంలో పిడుగు పడి తాడి చెట్టు పూర్తిగా కాలిపోయింది.
pidugu

తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు

- మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి
రాష్ట్రవ్యాప్తం గా అకాల వర్షాలతో తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజను తడువకుండా కాపాడాలని సూచించారు. అందుకు అవసరమైన టార్పాలిన్లు విస్తృతంగా సరఫరాచేయాలని ఆదేశించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు.

రైతులు అధైర్యపడొద్దు: మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: అకాల వర్షానికి కొన్నిచోట్ల ధాన్యం తడిసిందని, రైతులెవరూ అధైర్యపడొద్దని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

5475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles