నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు


Wed,August 14, 2019 01:10 AM

heavy rains in some places

-బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం
-హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రుతుపవనాలు చురుకుగా కదలడం వల్ల బుధవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉత్తర, ఈశాన్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని పేర్కొన్నది. గురువారం నుంచి రుతుపవనాలు అంత బలంగా ఉండకపోవచ్చని, తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమబెంగాల్ దక్షిణ తీరం, ఉత్తర ఒడిశా తీరప్రాంతాల్లో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని చెప్పారు. దీని ప్రభావం తెలంగాణపై అంతగాలేదని ఆయన పేర్కొన్నారు.

-చల్లబడ్డ గ్రేటర్ హైదరాబాద్
రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం అధికారులు తెలిపారు. ఒకటి, రెండుచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 77 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. వాతావరణం చల్లగా మారింది.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles