ఉరుములు, మెరుపులు


Wed,May 22, 2019 02:35 AM

Heavy Rain In Telangana

-పలుజిల్లాల్లో గాలివాన బీభత్సం
-పిడుగులు పడి నాగర్‌కర్నూల్‌లో వ్యక్తి మృతి, 25 మేకలు..
-గాలిదుమారానికి నేలకూలిన చెట్లు, ఎగిరిపోయిన పైకప్పు రేకులు
-పలుచోట్ల కురిసిన వడగండ్లు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం, రాత్రి వేళ ల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మరణించగా, 25 మేకలు మృత్యువాత పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల ధాన్యం తడిసింది.

rain4

పశువుల కాపరి మృతి..

నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం, ఉరుములు, మెరుపులు రా వడంతో మేకల కాపరి పుట్ట శ్రీను (29) మేకలు, పశువులతో కలిసి చెట్టుకిందకి వెళ్లాడు. సమీపం లో పిడుగుపడటంతో శ్రీను అక్కడిక్కడే మృతి చెందాడు. నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి సమీపంలో పిడుగుపడటంతో 25 మేకలు మృత్యువాత పడ్డాయి.

rain6

కూలిన పౌల్ట్రీఫారం.. కోళ్లు మృతి..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అ బ్బెంద గ్రామంలో తీవ్రమైన ఈదురు గాలులకు తోడు పిడుగు పడటంతో కోళ్లఫారం షెడ్డు కూలిపోయింది. ఇందులోని కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడటంతో సుమారు రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు బాధితుడు సుభాష్‌రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, పొత్తూరులో ఈదురు గాలులతోపాటు వడగండ్ల వాన కురిసింది. కందికట్కూర్‌లోని కొనుగోలు కేంద్రంలోకి వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసింది. వడగండ్లు కురువడంతో మామిడి కాయలు, కూరగాయల తోటలు తెబ్బతిన్నాయి. భారీగా వీచిన ఈదురు గాలులకు పొత్తూరు శివారులోని ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదు రు గాలులతో కూడిన వర్షానికి కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసింది. రేకులు ఎగిరిపోవడంతో పలు షెడ్లు దెబ్బతిన్నాయి. కొడిమ్యాల నుంచి జేఎన్టీయూ వరకు, కొడిమ్యాల నుంచి నల్లగొండ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు కూలిపోయాయి. తిప్పాయపల్లిలో శ్మశాన వాటిక వద్ద గాలులకు గోడ పైకప్పు రేకులు ఎగిరిపోగా ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మూడు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్యాల మండలంలోని గ్రామాల్లోనూ రేకుల షెడ్లు, పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

rain7
మా మిడి కాయలు నేలరాలాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో చెట్టు కొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం స్వల్పంగా తడిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతోపాటు లింగాపూర్ మండలంలోని పలుచోట్ల వర్షం ప డింది. నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రం లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్త రు వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో 15 నిమిషాలపాటు వర్షం కురిసింది. వర్ని, రుద్రూర్, కోటగిరి, చందూర్, మోస్రా, రెంజల్, ఎడపల్లి, నవీపేట్‌లో మండలాల్లో అక్కడక్కడ జల్లులు పడ్డాయి. బోధన్ డివిజన్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో చెట్టుపై పిడుగుపడింది. ఆర్మూరు డివిజన్‌లోనూ చిరుజల్లులు కురిశాయి. నందిపేట మం డలం వన్నెల్(కె) గ్రామంలో పిడుగుపాటుకు దూడ మృత్యువాత పడింది. కామారెడ్డి జిల్లాలో ని లింగంపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసింది.

rain5

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. చేవెళ్లలోని ఓ ఇంట్లో కొబ్బరి చెట్టుపై పిడుగుపడటంతో ఆ చెట్టు కాలిపోయింది. పలు ఇండ్లల్లోని టీవీలు, సెట్‌ఆఫ్ బాక్సులు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. యాచారం మండలం నంది వనపర్తిలో ఎండ్ల జంగయ్య ఇంట్లోని కొబ్బరి చెట్టుపై పిడుగుపడటంతో చెట్టుకు మంటలు అంటుకున్నాయి.

rain3

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవా రం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహి ల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, ముషీరాబాద్, కూకట్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. గంటకు 34 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షంతోపాటే ఈదురుగాలులు వీయడంతో జనం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తోపాటు కమిషనర్ దానకిశోర్ జీహెచ్‌ఎంసీ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్, రెస్క్యూ టీం సభ్యులు అప్రమత్తంగా ఉండి రాకపోకలు సాఫీగా సాగేలా చూశారు.

rain2
మ్యాన్‌హోల్స్ క్లియర్ చేయడంతోపాటు రోడ్డుపై కూలిన చెట్లను తొలగించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి తగు చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని బొల్లారంలో 29.8 మి.మీ., మేడ్చల్‌లో 23.0 మి.మీ., బేగంపేటలో 17,8, కుత్బుల్లాపూర్‌లోని జీహెచ్‌ఎంసీ ఏరియాలో 11.5, దుండిగల్, దూలపల్లిలో 11.33, శామీర్‌పేటలోని ఆలియాబాద్‌లో 6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతి చెందాయి.

6573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles