సీజనల్‌వ్యాధుల నివారణకు కృషి


Thu,September 12, 2019 03:12 AM

Healthcare is high on agenda says Eatala Rajender

-వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
-వివిధ జిల్లాలో సమీక్షలు

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి/ ములుగు ప్రతినిధి/ మహబూబాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/రెడ్డికాలనీ(వరంగల్): సీజనల్ వ్యాధులను నివారించేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్ ఆఫీసర్లకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. బుధవారం మంత్రి వరంగల్ అర్బన్ కలెక్టరేట్‌లో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల వైద్యసిబ్బందితో సమీక్షించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లితో కలిసి పర్యటించి, కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులు, డాక్టర్లతో సమీక్షించారు. కొత్తగూడెంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు భద్రాద్రి సీతారామచంద్రస్వామి దర్శించుకున్నారు. ములుగు ఏరియా దవాఖానను పరిశీలించి ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన వైద్య సిబ్బందితోనూ సమీక్షించారు.

ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైరల్‌జ్వరాలు నియంత్రణలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్రామాల్లో ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజల అవసరాల దృష్ట్యాకొన్ని రోజులు సెలవులను త్యాగం చేయాలని వైద్యాధికారులకు సూచించారు. త్వరలోనే రూ.100 కోట్ల వ్యయంతో మహబూబాబాద్‌లో జిల్లాస్థాయి వైద్యశాలను నిర్మించనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మహబూబాబాద్ ఎంపీ మాలో త్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, సీతక్క, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.

179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles