నిద్ర పోవటంలేదా.. మీ గుండె భద్రం!


Thu,September 12, 2019 02:57 AM

Have you got a heart attack

మీరు సిగరెట్లు తాగరు.. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేస్తారు.. మీ ఫ్యామిలీలో కూడా గుండెపోట్ల రిస్కు లేదు.. అయినా మీకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? అయితే తగినంత నిద్రపోతున్నారా? లేదా? చెక్ చేసుకోండి అంటున్నారు పరిశోధకులు. తగినంత సమయం నిద్రపోకపోయినా, అతిగా నిద్రపోయినా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందని కొలరాడో యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితాలు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జన్యుపరమైన రిస్కు ఉండి, నిద్ర ఆరు గంటలకన్నా తక్కువ, లేదా 9 గంటలకన్నా ఎక్కువ ఉన్నా.. రిస్కు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. నిద్రపోయే సమయానికి, గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నదని ఈ అధ్యయనం నిర్థారిస్తున్నది. 6 నుంచి 9 గంటల నిద్ర పాటించేవాళ్లలో జన్యుపరమైన రిస్కు ఉన్నప్పటికీ గుండెపోట్లు వచ్చే అవకాశం 18% తగ్గుతుందంటున్నారు అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ సెలీన్ వెట్టర్. అయితే ఎందువల్ల ఇలా గుండె ఆరోగ్యంపై నిద్ర ప్రభావం చూపుతున్నదన్న విషయాలను ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నది. ఏదిఏమైనా కంటినిండా నిద్ర ఉంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుందని గ్రహించాలంటున్నారు పరిశోధకులు.

172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles