రాబడులు పెంచండి

Sat,November 9, 2019 01:33 AM

-అనవసర ఖర్చులు తగ్గించండి
-ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆదేశం
-ఆర్థిక స్థితిగతులపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచాలని, అనవసర ఖర్చులు తగ్గించాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆర్థికశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆర్థిక సంవత్సరం మొదలై ఎనిమిది నెలలు గడిచిన క్రమంలో ఆదాయవ్యయాలు ఎలా ఉన్నాయి? ఆర్థికమాంద్యం ప్రభావం ఎంతమేరకు ఉన్నది? అనే విషయాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచడానికి అనుసరించవలసిన వ్యూహంపై నిర్దిష్ట సూచనలు చేశారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని, సంక్షేమ పథకాల అమలుకు సరిపడే విధంగా అవసరమైన నిధులను సమకూర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

సంక్షేమ పథకాలు, అత్యవసర పనులకు సంబంధించిన నిధులను వెంటవెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటవెంటనే చెల్లించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర సొంత పన్నుల రాబడుల తీరు తెన్నులను పరిశీలించిన మంత్రి.. రాబడుల విషయంలో వేగం పెంచాలని సూచించారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బకాయిలు, పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. వచ్చే నాలుగునెలలు చాలా కీలకమైనవని, గత ఏడాదికంటే ఈ సారి రాబడులను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.

223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles