విజయ డెయిరీకే పాలు అమ్మండి

Thu,October 10, 2019 03:00 AM

-రైతులకు మద్దతు ధర అందిస్తాం
-ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు
-గద్వాలలో సబ్సిడీ ఆవుల పంపిణీ

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: త్వరలోనే గద్వాలలో విజయ డెయిరీ ద్వారా పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామనీ, రైతులందరూ అక్కడే పాలు విక్రయించి ప్రభుత్వం నుంచి రూ.4 అదనంగా పొందాలని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో మంత్రి లబ్ధిదారులకు పాడిపశువులను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతలను త్వరలోనే పూర్తిచేస్తామని చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో ధాన్యం దిగుబడి అధికంగా పెరుగబోతున్నదని చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా గద్వాలలో 411 ఆవులు రైతులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలంపూర్, దేవరకద్ర ఎమ్మెల్యేలు వీఎం అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సరిత, కలెక్టర్ శశాంక, వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles