కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పిచ్చి ముదిరింది


Thu,May 16, 2019 02:12 AM

gutha sukender reddy slams Komatireddy Venkat Reddy

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు పిచ్చి ముదిరిందని.. నల్లగొండలో ప్రజలు ఓడగొట్టినా ప్రతి ఎన్నికలో మేమే అంటూ పోటీకొస్తున్న వాళ్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా.. నల్లగొండలో ఓడిన వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా, మరో సోదరుడు మోహన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పోటీ చేశారని.. తాజాగా రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మిని సైతం ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల కోటాలో పోటీ చేయించడంతో జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ వెనుకబాటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారణమని ఆరోపించారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు బండా నరేందర్‌రెడ్డి, పాశం రాంరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.

91
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles