గవర్నర్‌ను కలిసిన మండలి చైర్మన్ గుత్తా


Sat,September 14, 2019 02:00 AM

Gutha sukender reddy meet  Governor Tamilisai Soundararajan

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం తన కుటుంబసభ్యులతో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా పెద్దల సభలో చర్చలు జరుగాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. గవర్నర్‌ను కలిసినవారిలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులు కూడా ఉన్నారు.

గుత్తా ఎన్నికను ప్రకటిస్తూ నోటిఫికేషన్

శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నికైనట్టు ప్రకటిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. మండలి సభ్యులతో ప్రమాణం చేయించే అధికారాన్ని కూడా చైర్మన్‌కు కల్పిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

73
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles