అంధుడు.. అసామాన్యుడు!


Mon,August 26, 2019 01:13 AM

Gritty Game Changers of Indian real estate sector

మారథాన్ రేసుల్లో ఆసిఫ్ దిట్ట.. 21 కి.మీ. పరుగే ఆయన లక్ష్యం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఐ యామ్ ైబ్లెండ్.. బట్ ఐ యామ్ ట్రైన్డ్.. కొద్ది నెలల క్రితం ఓ సినిమాలో అంధుడి పాత్రలో హీరో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. ఇదే మాటను ఇప్పుడు ఓ బహుళజాతి సంస్థలో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కోల్‌కతావాసి మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్ చెబుతున్నారు. అంధుడైనప్పటికీ ఎవరి సాయం లేకుండా మారథాన్ రేసును పూర్తిచేయడంలో దిట్టగా పేరుపొందిన ఆసిఫ్ ఇక్బాల్.. నార్ ఇండియా సదస్సులో పాల్గొంనేందుకు హైదరాబాద్‌కు వచ్చి రియల్టర్లకు స్ఫూర్తి మంత్రాన్ని బోధించారు. 16 ఏండ్ల వయసులోనే కంటిచూపు కోల్పోయిన ఆయన.. ఇప్పటికే పలుమార్లు 10 కి.మీ. మారథాన్లను పూర్తిచేశారు. ఈ ఏడాది 21 కి.మీ. మారథాన్‌ను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలిపారు. ప్రస్తుతం నా వయసు 40 ఏండ్లు. చూపు లేకపోయినప్పటికీ నా లక్ష్యంపై పూర్తి దృష్టితో ఉన్నా. 20 కి.మీ. మారథాన్‌ను విజయవంతంగా పూర్తిచేయగలనన్న నమ్మకమున్నది అని చెప్పారు. ఆసిఫ్ జీవితం స్ఫూర్తి దాయకమని, ఆయన ప్రసంగం అందరినీ ఆలోచింప చేసిందని నార్ నూతన అధ్యక్షుడు సుమంత్‌రెడ్డి ఎరాని ప్రశంసించారు.

440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles