గ్రీన్ చాలెంజ్ @ 3 కోట్లు

Sat,September 14, 2019 02:27 AM

- ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డైరెక్టరేట్‌లో మూడుకోట్ల ఒకటో మొక్కను నాటిన ఎంపీ సంతోష్‌కుమార్


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలో నాటిన మొక్కల సంఖ్య మూడుకోట్లు దాటింది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డైరెక్టరేట్ ప్రాంగణంలో సంతోష్‌కుమార్ శుక్రవారం మూడుకోట్ల ఒకటో మొక్కను నాటారు. ఆయనతోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి తమవంతు తోడ్పాటునందించి పచ్చదనాన్ని పెంచాలన్న ఆశయంతో ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ చాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. స్వయంగా తాను మొక్కను నాటడమే కాకుండా మరో ముగ్గురిని నామినేట్‌చేసి మొక్కలు నాటాల్సిందిగా కోరడమే గ్రీన్ చాలెంజ్ ఉద్దేశం.
MP-Santosh2
ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే గ్రీన్ చాలెంజ్‌కు అనూహ్య స్పందన లభించింది. రాజకీయ నేతలు, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు, అధికారులతోపాటు సామాన్యపౌరులు సైతం గ్రీన్ చాలెంజ్‌లో భాగస్వాములవడంతో అనతికాలంలోనే మూడుకోట్ల మొక్కలకు చేరుకుంది. గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొనడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని, మానవ మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. గ్రీన్ చాలెంజ్‌లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించేవారిని డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం వనమిత్ర పేరిట ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు ఇైగ్నెటింగ్ మైండ్స్ సంస్థ నిర్వాహకుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గ్రీన్ చాలెంజ్ ద్వారా 10 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు. ఐపీఎస్ అధికారి విశ్వజిత్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్, రాంగోపాల్‌పేట కార్పొరేటర్ అత్తెల్లి అరుణ, తదితరులు పాలొన్న ఈ కార్యక్రమానికి ఇంగ్నైటింగ్ మైండ్స్ ప్రతినిధి రాఘవ సమన్వయకర్తగా వ్యవహరించారు.
MP-Santosh1
డ్రగ్స్ ఫ్రీ వరల్డ్ జూనియర్ క్యాంపెయిన్ హెడ్ చిన్నారి తానియాబేగం హరితహారంలో భాగంగా శుక్రవారం అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో మూడుమొక్కలు నాటింది. అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి, రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డికి గ్రీన్‌చాలెంజ్ విసిరింది. తానియా చాలెంజ్‌ను కిరణ్‌బేడీ స్వీకరించారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles