అదే జోరు..


Sun,January 13, 2019 02:44 AM

Gram Panchayat Growing unanimals In Telangana

-రోజురోజుకూ పెరుగుతున్న ఏకగ్రీవాలు
-అభివృద్ధికే పట్టం కడుతున్న పల్లె ప్రజలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పల్లె ప్రజలు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. రోజురోజు కూ వీటి సంఖ్య పెరుగుతున్నది. ఆయా గ్రామస్థులంతా ఒక్కతాటిపైకి వచ్చి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకుంటున్నారు. అభివృద్ధికి పెద్దపీట వేస్తారనే నమ్మకమున్న వారినే ప్రతిపాదిస్తున్నారు. అదీగాక ప్రోత్సాహక నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనతో ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతున్నారు. శనివారం కూడా పెద్ద ఎత్తున పల్లె ప్రజలు ఏకగ్రీవాల బాటపట్టారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం సర్పంచ్ తండా నూతన సర్పంచ్ గా మాలావత్ సర్య, ఇదే మండలం గడ్డమీది తండా సర్పంచ్‌గా భట్టు సుమలత, ఉప సర్పంచ్‌గా మల్లేశ్ ఎన్నికయ్యారు. అనంతరం వారు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను మర్యాద పూర్వకంగా కలువగా ఆయన వారిని శాలువా, పూలమాలలతో సత్కరించారు.

నందిపేట్ మండలం గాదేపల్లి సర్పంచ్ సహా పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థిత్వానికి మూడు నామినేషన్లు దాఖలు కాగా, నక్కల భూమేశ్‌కు పోటీగా ఉన్న నక్కల నర్సవ్వ, విక్రమ్‌రెడ్డి శనివారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నా రు. దీంతో నక్కల భూమేశ్ సర్పంచ్‌గా ఏకగ్రీవయ్యారు. గ్రామంలోని ఎనిమిది వార్డులు సైతం ఏకగ్రీవం కాగా వారంతా కలిసి ఉప సర్పంచ్‌గా మగ్గిడి విక్రమ్‌రెడ్డిని ఎన్నుకున్నారు. భీమ్‌గల్ మండలం రూప్లాతండా, ఎంజీతండా, సంతోష్‌నగర్‌తండా, సుదర్శన్‌నగర్ తండా, తాల్లపల్లి తండాలు ఏకగ్రీవమయ్యాయి. వీరంతా శనివారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలువగా ఆయ న వారిని సన్మానించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో నూతనంగా ఏర్పడ్డ సుల్తాన్‌నగర్ సర్పంచ్‌గా అమీనాబీ, ఉప సర్పంచ్‌గా జూకంటి సాయవ్వను ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి సర్పంచ్‌గా జాదవ్ తిత్రిబాయి, ఉప సర్పంచ్‌గా జాదవ్ సుభాష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండ లం ఎర్రాపూర్ గ్రామ సర్పంచ్‌గా నూనవత్ శాంత, ఉప సర్పంచ్‌గా మిట్టపల్లి శంకర్, వార్డు సభ్యులుగా కుర్మ సుదర్శన్, బంటు పుష్ప, మలవాత్ లక్ష్మి, మలవాత్ యమున బాయి, మలవాత్ భీమా నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రెండు జీపీలు ఏకగ్రీవం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట మండలంలోని రాఘవపట్నం, ముత్తాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గాలను స్థానికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాఘవపట్నం సర్పంచ్‌గా దబ్బకట్ల లలిత, వార్డు సభ్యులుగా ప్రతికంఠం ధరణి, కంటెం సునీత, బొమ్మినేని లలిత, పాయం స్వరూప, తుమ్మల గాంధీ, దనసరి గాంధీ, ముజీబా, పోలెబోయిన గంగయ్యలను ఎన్నుకున్నారు. ముత్తాపూర్ సర్పంచ్‌గా వంక నాగేంద్ర, వార్డు సభ్యులుగా వట్టం శేషమ్మ, అర్రెం రాజేశ్వరీ, దబ్బకట్ల కృష్ణ, వంక అర్జున్, కొట్టెం అమృత, పూనెం బుచ్చయ్యను ఎన్నుకున్నారు.

పాలమూరులో..

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి సర్పంచ్‌గా దాడి సంగీత, ఉపసర్పంచ్‌గా విష్ణువర్ధన్‌రెడ్డితోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం షాపూర్ సర్పంచ్‌గా రామాంజనేయులుగౌడ్ ఎన్నికయ్యారు.

1911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles