లోకాయుక్త నియామకానికి కసరత్తు


Thu,September 12, 2019 02:13 AM

Govt reporting to the High Court

- త్వరలోనే హెచ్చార్సీ చైర్మన్, ఆర్టీఐ కమిషనర్ల నియామకాలు
- హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు, సమాచార కమిషనర్ల నియామకాలపై కసరత్తు కొనసాగుతున్నదని ప్రభు త్వం హైకోర్టుకు తెలిపింది. లోకాయుక్త, హెచ్చార్సీ చైర్మన్, ఆర్టీఐ కమిషనర్ వంటి కీలక పదవులు చాలాకాలంగా ఖాళీగా ఉంటున్నాయని, దీనివల్ల కక్షిదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. కీలక పదవులు సుదీర్ఘకాలంగా ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్నించింది. వివరాలు సమర్పించేందుకు నాలుగువారాలు సమయం ఇస్తున్నామని, కేసును అప్పటివరకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

141
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles