ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా గవర్నర్!


Fri,July 12, 2019 01:43 AM

Governor to be appointed rjukt chancellor

-వర్సిటీ చట్టాల మార్పు కమిటీ భేటీలో చర్చ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను నియమించాలని.. వర్సిటీ చట్టాల మార్పు కమిటీ భావిస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఏపీలో ఉన్న ఆర్జీయూకేటీ చట్టాన్ని మార్పుచేయాలని నిర్ణయించింది. వీసీలతో ఏర్పాటుచేసిన యూనివర్సిటీ చట్టాల మార్పు కమిటీ గురువారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమైంది. ఇప్పటివరకు ఆర్జీయూకేటీకి చాన్స్‌లర్‌గా ప్రైవేటు వ్యక్తి కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వర్సిటీ విడిపోయి.. చాన్స్‌లర్ పోస్ట్ ఏపీలోని ఆర్జీయూకేటీకి వెళ్లింది. నాటినుంచి తెలంగాణలో చాన్స్‌లర్ పోస్టు ఖాళీగా ఉన్నది.

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న స్టేట్ యూనివర్సిటీల మాదిరిగానే ఆర్జీయూకేటీ చట్టాన్ని కూడా మార్చుతున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీ చట్టాన్ని తీసుకురావాలనే అంశంపైనా కమిటీ అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. సంప్రదాయ యూనివర్సిటీలకు, స్టేట్ యూనివర్సిటీలకు, ఓపెన్ యూనివర్సిటీలకు కామన్‌గా చట్టాలను చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే కమిటీ అధ్యయనం పూర్తవుతుందని, అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.

64
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles