‘సైరా’కు గవర్నర్ అభినందనలు

Thu,October 10, 2019 02:49 AM

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: తొలి స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా నిర్మించిన సైరా చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తిలకించారు. సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు గవర్నర్ తన కుటుంబసభ్యులతో సినిమా చూశారు. గవర్నర్ కోసం ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రత్యేకషోను ఏర్పాటు చేశారు. గవర్నర్‌తోపాటు చిరంజీవి, కాస్ట్యూమ్ డిజైనర్ సుష్మిత హాజరయ్యారు. గొప్ప చరిత్రకారుడు, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను వెలుగులోకి తెచ్చి నేటితరానికి అందించిన చిత్రబృందాన్ని గవర్నర్ అభినందించారు. చిరంజీవి నటన బాగుందని, నరసింహారెడ్డి పాత్రకు జీవం పోశారని అన్నారు. సినిమాను తిలకించినందుకు చిరంజీవి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

1031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles