ప్రత్యేక టూర్ ప్యాకేజీలతో మేలు


Sat,September 14, 2019 02:05 AM

Governor Bandaru Dattatreya Visits Yadadri Lakshmi Narasimha Swamy Temple

-దేశంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా యాదాద్రి
-హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణను కలుపుతూ పర్యాటకరంగ అభివృద్ధి కోసం ఇరు రాష్ర్టాల సీఎంలతో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీల ఏర్పాటుకు కృషిచేస్తానని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, అనంతరం హరితకాటేజీలో మీడియాతో మాట్లాడారు. తర్వాత భువనగిరి జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంగా యాదాద్రి విలసిల్లాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. తానెక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డను అని చెప్పుకోవడానికి గర్వపడుతానని చెప్పారు.

215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles