కులవృత్తులకు అండగా ప్రభుత్వం

Sat,November 9, 2019 01:14 AM

-మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
-నారాయణపురంలో మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహావిష్కరణ

సంస్థాన్‌నారాయణపురం: తెలంగాణ ప్రభు త్వం కులవృత్తులకు అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గౌడసంఘం, గీత పరివారల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు రూ.10 కోట్లను విడుదల చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ పాల్గొన్నారు.

262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles