ఎస్సెస్సీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల దూకుడు


Thu,May 16, 2019 01:21 AM

Government Student toppers In TS SSC Class 10 results 2019

-8,676 మందికి 10/10 జీపీఏ
-13,498 మందికి 9.8 జీపీఏ
-ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఈ నెల 13న విడుదలచేసిన ఎస్సెస్సీ వార్షిక ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు. పరీక్షలకు మొత్తం 5,06,202 మంది హాజరుకాగా, 4,67,859 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో తొమ్మిదిపైగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ)ను 1,20,928 మంది విద్యార్థులు సాధించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇందులో 10/10 జీపీఏ 8,676 మంది విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు చెప్పారు. 9.8 జీపీఏ 13,498 మంది, 9.7 జీపీఏ 16,155 మంది, 9.5 జీపీఏ 18,139 మంది, 9.3 జీపీఏ 19,918 మంది, 9.2 జీపీఏ 21,494, మంది, 9 జీపీఏ 22,964 మంది సాధించినట్టు ఆయన వివరించారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలలవారీగా జీఏపీ సాధించిన విద్యార్థులు వివరాలను ఆయన వెల్లడించారు.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles