విషజ్వరాల కట్టడికి ప్రత్యేక చర్యలు


Sat,September 14, 2019 12:42 AM

Government branches working in coordination

- సమన్వయంతో కృషిచేస్తున్న ప్రభుత్వ శాఖలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో విషజ్వరాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వివిధ శాఖలను సమన్వయం చేసుకొని ప్రత్యామ్నాయ విధానాలను అవలంబిస్తున్నది. డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాలను వ్యాప్తిచేస్తున్న దోమల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు సీజనల్ వ్యాధులు, నివారణ చర్యలపై క్యాలెండర్‌ను రూపొందించడంపై దృష్టిసారించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని 1,697 గ్రామాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి మలేరియా, డెంగీ, డయేరియా, జాండిస్, టైఫాయిడ్, చికున్‌గున్యా వ్యాధుల నియంత్రణ, నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యాధికారకాలను నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఐటీడీఏ, గిరిజన ప్రాంతాల్లో పీహెచ్‌సీలు, పారామెడికల్ సిబ్బంది వద్ద తగినన్ని మందులు అందుబాటులో ఉంచారు.

56
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles