విప్‌గా సునీత బాధ్యతల స్వీకరణ

Fri,November 8, 2019 01:59 AM

- అభినందించిన మండలి చైర్మన్ గుత్తా, పలువురు మంత్రులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమూద్‌అలీ, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు అభినందించారు. వీరితోపాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అభినందించారు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles