సముద్రస్నానానికి వెళ్లి విద్యార్థి మృతి

Mon,November 11, 2019 01:13 AM

-నలుగురు గల్లంతు..
శ్రీకాకుళం: సముద్రస్నానానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు మృతిచెందగా.. నలుగురు గల్లంతయ్యారు. ఒకరిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్‌లో ఆదివారం చోటుచేసుకున్నది. శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో సెకండ్ ఇంటర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఆదివారం సెలవు కావడంతో కలింగపట్నం బీచ్‌కు వెళ్లారు. విద్యార్థులు సముద్రంలో దిగగానే అలలు వచ్చాయి. దీంతో విద్యార్థులు గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు ఒకరిని రక్షించారు. మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

70
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles