ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Sun,October 13, 2019 01:30 AM

-అనంతపురంలో విషాదం..
-మృతుల్లో ఇద్దరు హైదరాబాద్ వాసులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నీటికుంటలో ఈతకు దిగిన ఇద్దరు చిన్నారులతోపాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పాలవాయి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చిన్నారులు పాలవాయి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం మమత అనే మహిళతో కలిసి చిన్నారులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. సమీపంలో ఉన్న ఓ నీటి కుంటలోకి చిన్నారులు ఈత కొట్టేందుకు దిగారు. ఈక్రమంలో నీటిలో మునిగిపోయారు. పిల్లలను కాపాడేందుకు నీటిలోకి దిగిన మమత సైతం మృతి చెందింది.

68
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles