పెన్షనర్ల డీఏ పెంపుపై జీవో

Sat,November 9, 2019 01:31 AM

- 33.536 శాతానికి పెరిగిన కరువుభత్యం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ పింఛనుదారులకు డీఏను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. డీఏను 3.144% పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 30.392 శాతంగా ఉన్న డీఏ.. తాజా ఉత్తర్వులతో 33.536 శాతానికి పెరిగింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

స్పిన్నింగ్ మిల్లులకు రూ.16.64 కోట్లు

స్పిన్నింగ్ మిల్లులకు చెల్లించాల్సిన రూ. 16.64 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా శుక్రవారం జీవో విడుదల చేశారు. 2017 అక్టోబరు నుంచి 2019 మార్చి దాకా చెల్లిం చాల్సి నిధులను ప్రభు త్వం విడుదల చేసింది.

ఉద్యానవనాల నిర్వహణకు రూ.5.28 కోట్లు

రాష్ట్రంలోని ఉద్యానవనాల నిర్వ హణకు ప్రభుత్వం రూ.5.28 కోట్లు విడుదల చేసిం ది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖల ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles