ముమ్మరంగా గ్రీన్‌చాలెంజ్

Thu,December 5, 2019 02:22 AM

-మొక్కలు నాటిన ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుభాశ్‌రెడ్డి, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్

ఉప్పల్, నమస్తే తెలంగాణ/ మెట్‌పల్లి టౌన్: రాజ్యసభ సభ్యు డు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్‌కు అపూర్వస్పందన లభిస్తున్నది. ప్రముఖులు ముమ్మరంగా మొక్క లు నాటుతూ ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. బుధవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లిలోని వెల్లుల్ల రోడ్డులో మొక్కలు నాటారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్‌తో కలిసి ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌చాలెంజ్ మంచి కార్యక్రమమని అజారుద్దీన్ అభినందించారు. అనంతరం ఐటీశాఖ మంత్రి కేటీఆర్, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు గ్రీన్‌చాలెంజ్ విసిరారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట కార్పొరేషన్ (టీయూఎఫ్ ఐడీసీ) చైర్మన్ విప్లవ్‌కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిశోర్ కూడా మొక్కలు నాటారు.
GREEN-CHALENGE1
GREEN-CHALENGE2

85
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles