ఐక్యంగా పనిచేద్దాం


Sun,February 17, 2019 02:07 AM

GHMC Mayor Bonthu Rammohan Over SRDP Works In Hyderabad City

-సమిష్టిగా పనిచేస్తేనే మున్నూరుకాపుల సమస్యలు పరిష్కారం
-జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్
-ప్రత్యేక కార్పొరేషన్, మరో ఐదెకరాల స్థలం, రూ.5 కోట్లు కేటాయించాలి
-మున్నూరుకాపు రాష్ట్రస్థాయి సమావేశంలో తీర్మానం

ఘట్‌కేసర్: ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని, సీఎం కేసీఆర్ మున్నూరుకాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలోని శివాస్ ఫంక్షన్ హాలులో శనివారం తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, భాగ్యనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుటం పురుషోత్తంరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మేయర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మున్నూరుకాపు కులానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారని గుర్తుచేశారు. తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీ ప్రకాశ్ మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు చెరువులనే నమ్ముకున్న మున్నూరుకాపులకు కొత్త ప్రాజెక్టుల ద్వారా ఎంతో లబ్ధిచేకూరనున్నదని తెలిపారు. మున్నూరుకాపులను బీసీలు కాకుండా బహుజన క్లాస్ పీపుల్‌గా పిలువాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలుద్దామని చెప్పారు. సీఎం పీఆర్వో రమేశ్ హజారి మాట్లాడుతూ వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నవారిలో మున్నూరుకాపులు ముందున్నారని పేర్కొన్నారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ జెండా ను.. సావనీర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులు గుజ్జ రమేశ్, బైనగారి నాగరాజు, పలు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పలు అంశాలపై తీర్మానాలు

ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 18 శాతం ఉన్న మున్నూరుకాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందించాలని తీర్మానించారు. మూన్నూరుకాపు విద్యార్థి వసతి గృహం దేవాదాయశాఖ పరిధిలో ఉన్నందున తిరిగి మున్నూరుకాపు సంఘానికి అప్పగించాలని, అన్ని కులాల గౌరవాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసినట్టు వివరించారు. ఇప్పటికే మున్నూరుకాపు కులస్తులకు ఐదెకరాల స్థలం, రూ.5 కోట్లు కేటాయించాడాన్ని స్వాగతిస్తూ, మరో ఐదెకరాల స్థలంతోపాటు మరో రూ.5 కోట్లు కేటాయించాలని, ప్రతి జిల్లాలో రెండెకరాల స్థలం కేటాయించి మున్నూరుకాపు బాలుర, బాలికల వసతి గృహం నిర్మించాలని తీర్మానించినట్టు చెప్పారు.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles