కనువిందు చేస్తున్న గాయత్రి జలపాతం


Sun,August 28, 2016 01:03 AM

Gayatri water Falls has good to see

gayathri-waterfall
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని గాయత్రి జలపాతం కనువిందు చేస్తున్నది. సుమారు 70 మీటర్ల ఎత్తున్న రాతి కొండనుంచి కిందకు జాలువారుతున్న జలపాతం అందాలు చూసినవారిని మైమరపిస్తున్నాయి. నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య గుండి వాగు ప్రవహిస్తుంది. మండలంలోని తర్నం బీ గ్రామ శివారు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జలపాతం ప్రకృతి సిద్ధంగా వెలిసింది. ఇంతటి అందాల జలపాతానికి కాలినడకన వెళ్లాల్సిందే. తర్నం బీ గ్రామంనుంచి మూడు కిలోమీటర్లవరకు అడవిలో నడిచి వెళ్లాలి. జలపాతం కింది ప్రాంతానికి వెళ్లాలంటే రాళ్లతో కూడిన ప్రమాదకరమైన ఒర్రె నుంచి వెళ్లాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని గాయత్రి జలపాతానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే మరో కుంటాల జలపాతంగా మారి.. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్నది.
- నేరడిగొండ

2634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles