భారీగా గంజాయి పట్టివేత


Fri,July 12, 2019 02:02 AM

Ganja seized, Siddipet, Hyderabad

-సిద్దిపేట,జనగామలో టన్నుకుపైగా స్వాధీనం.. ఆరుగురి అరెస్టు
-గంజాయి విలువ రూ.2 కోట్లు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రెండుచోట్ల గురువారం పెద్దమొత్తంలో గం జాయి పట్టుబడింది. సిద్దిపేట జిల్లా దుద్దెడ క్రాస్‌రోడ్డు వద్ద, జనగామ జిల్లాకేంద్ర శివారులో అధికారులు టన్నుకుపైగా గంజాయి స్వాధీనంచేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. డీసీఎంలో పెద్దమొత్తంలో గంజాయిని భద్రాచలం నుంచి జహీరాబాద్‌కు తరలిస్తున్నారనే సమాచారంపై డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున సిద్దిపేట జిల్లా దుద్దెడ క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ వాహనాన్ని తనిఖీచేయగా.. కొబ్బరి, జామ మొక్కల మాటున గోధుమరంగులో ఉన్న 477 గంజాయి ప్యాకెట్లను (962.7 కిలోలు) గుర్తించారు.

ఇద్దరిని అరెస్టుచేశారు. గంజాయి విలువ రూ.1,92,54,000 ఉంటుంది. ము లుగు జిల్లాకు చెందిన అవుడియా రవీందర్ ముఠా కారులో గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు చేరవేస్తున్నట్టు సమాచారం అందడంతో జనగామ శివారులోని కింగ్స్‌వే దాబా వద్ద ప్రొహిబిషన్, ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్ బృందం, జనగామ ఎక్సైజ్ సిబ్బంది కారును సోదాచేయగా 130.3 కిలోల ఎండుగంజాయి లభించింది. అవుడియా రవీందర్‌తోపాటు అతడి ముఠాకు చెందిన వంకుడోతు రాజు, గుగులోతు హరిలాల్, బుక్య మంగులాల్‌ను అరెస్టు చేశారు. గంజాయి విలువ రూ.26 లక్షలు ఉంటుంది.

467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles