మజ్లిస్ ముద్ర


Mon,March 25, 2019 01:54 AM

From Hyderabad to Aurangabad TRS win in local elections

-హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా..
-స్థానిక ఎన్నికల్లో గెలుపు
-హిందువులకు ప్రాతినిధ్యం
-టీఆర్‌ఎస్‌తో దోస్తీ
-జాతీయ రాజకీయాల వైపు అడుగులు

హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా రాజకీయ పునాది వేసుకున్న ఆల్‌ఇండియా మజ్లిస్ -ఏ-ఇత్తేహాదుల్ ముస్లీమిన్ రాష్ట్ర పార్టీగా అవతరించింది. ప్రతి ఎన్నికలోనూ తన బలాన్ని పెంచుకుంటూ జాతీయస్థాయి రాజకీయాలకు విస్తరిస్తున్నది. ఒకప్పుడు ఒకవర్గానికే పరిమితమైన పార్టీ క్రమంగా అన్ని వర్గాలపై తనదృష్టి సారించింది. ముస్లింల ప్రయోజనాలను కాపాడటానికి అవతరించిన పార్టీ ఇతర వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పిస్తూ తనపై ఉన్న మతతత్వ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ తమ ధ్యేయమని కూడా ఇటీవల ఆ పార్టీ ప్రకటించింది. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాల్లో కూడా తన రాజకీయ బలాన్ని బలగాన్ని పెంచుకుంటున్నది. ఏఐఎంఐఎం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.

ప్రత్యేక ప్రతినిధి, నమస్తేతెలంగాణ: అనాదిగా రాజధాని హైదరాబాద్ రాజకీయాలపై బలమైన ప్రభావం చూపుతున్న మజ్లిస్-ఏ-ఇత్తేహాదుల్ ముస్లీమిన్ పార్టీకి 1927 నవంబర్ 12న బీజం పడింది. అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్‌అలీ ఖాన్ సలహా మేరకు నవాబ్ మహమూద్ నవాజ్‌ఖాన్ ఖిలేదార్ ఉల్మా-ఏ-మషాఖీన్ పార్టీని స్థాపించారు. అదే తర్వాత ఎంఐఎం పార్టీగా మారింది. 1938లో ఎంఐఎం అధ్యక్షుడిగా బహదూర్‌యా జంగ్ ఎన్నికయ్యారు. మొదట్లో ముస్లిం మత సంస్కృతి, సంప్రదాయ రక్షణనే ప్రధాన ఎజెండాగా ఉండేది. తర్వాత రాజకీయ ఎజెండాతో ముస్లిం లీగ్‌గా ఏర్పడింది. బహదూర్ యార్ జంగ్ మరణానంతరం పార్టీ 1944లో రజాకార్ల చేతిలోకి వెళ్లింది. ఖాసిం రజ్వీ పార్టీ నాయకుడిగా ఎంపికయ్యాడు. హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనం అయిన తర్వాత ఎంఐఎం పార్టీని 1948లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. 1948 నుంచి 1957 వరకు జైలులో ఉన్న రజ్వీని పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలన్న షరతుపై భారత ప్రభుత్వం విడుదల చేసింది. రజ్వీ వెళ్తూ వెళ్తూ పార్టీని హైదరాబాద్‌లో ప్రముఖ న్యాయవాది అబ్దుల్ వాహిద్ ఒవైసీకి పార్టీని అప్పగించారు. ఆయన 1958లో పార్టీని పునఃస్థాపించారు.

ఆ తర్వాత 1975లో అబ్దుల్ వాహిద్ కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ముస్లిం మైనార్టీవర్గ నాయకుడు (సాలార్ ఏ మిల్లత్)గా రాజకీయ చక్రం తిప్పారు. 1960లో మల్లేపల్లి వార్డు నుంచి సలావుద్దీన్ ఒవైసీ కార్పొరేటర్‌గా ఎన్నికై ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1962లో పత్తర్‌గట్టీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత చార్మినార్, యాకూత్‌పురా నియోజకవర్గాల నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీగా విజయం సాధించారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మజ్ల్లిస్ పార్టీకి కంచుకోటగా మారింది. 1992లో మాత్రం మజ్లిస్‌లో అంతర్గత తిరుగుబాటు వచ్చింది.
asaduddin
సలావుద్దీన్ ఒవైసీకి కుడిభుజంగా ఉన్న అమానుల్లాఖాన్.. సాలార్‌పై తిరుగుబాటుచేసి మజ్ల్లిస్ బచావో తెహ్‌రీఖ్ (ఎంబీటీ) ను స్థాపించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో ఎంబీటీ ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత ఎంబీటీ ప్రభావం తగ్గిపోయింది. ఎంఐఎం తిరుగులేని శక్తిగా ఎదిగింది. హైదరాబాద్ పాతబస్తీ రాజకీయం ఏకపక్షంగా మారింది. మొదట్లో మూడు నుంచి నాలుగు సీట్లు మాత్రమే ఉన్న ఎంఐఎం మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బలాన్ని పెంచుకుంది. దీంతో ఆ పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపు లభించింది. 2008 లో పగ్గాలు చేపట్టిన అసదుద్దీన్ ఒవైసీ వినూత్న పంథాలో పార్టీని మరింత బలోపేతం చేశారు. పార్టీని హైదరాబాద్‌లోనే కాకుండా పొరుగు రాష్ర్టాలకు విస్తరింపచేశారు. అసదుద్దీన్ 2004నుంచి వరుసగా మూడుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో మంచి వక్తగా రాణించి సన్‌సద్ రత్న అవార్డును పొందారు. మహారాష్ట్ర శాసనసభలో కూడా ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్రల్లో కూడా ఎంఐఎం పోటీచేస్తున్నది.
Abdul_Wahid

స్థానిక సంస్థల్లో మజ్ల్లిస్ జెండా

మజ్లిస్ పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 24 డివిజన్లను గెలుచుకున్నది. 1964లో 18 డివిజన్లను గెలుచుకున్న ఎంఐఎం ఆ తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్‌లో తన బలాన్ని పెంచుకున్నది. 1986లో 38 సీట్లను కైవసం చేసుకొని కాంగ్రెస్ మద్దతుతో మేయర్ సీటును కైవసం చేసుకున్నది. 2009 ఎన్నికల్లో 150 డివిజన్లకు 43 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించి మేయర్ సీటును దక్కించుకున్నది. ప్రస్తుతం హైదరాబాద్ కార్పొరేషన్‌లో 43 డివిజన్లను గెలుచుకున్నది. దీంతోపాటు భైంసా, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, తాండూర్ మున్సిపాలిటీలతోపాటు మహారాష్ట్ర ఔరంగాబాద్‌లలో కూడా ఎంఐఎం చెప్పుకోదగ్గ స్థానాలను గెలుచుకున్నది. భైంసాలో చైర్మన్, నిజామాబాద్‌లో డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకున్నది.

Salar

హిందువులకు ప్రాతినిధ్యం

మొదట మతతత్వ పార్టీగా ముద్రపడిన మజ్లిస్ తర్వాత తన పంథాను మార్చుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధన, వారి సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది. 1986లో కాంగ్రెస్ మద్దతుతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలోకి వచ్చిన మజ్లిస్ ముగ్గురు హిందువులను ఒక్కొక్కరిని ఒక్కో ఏడాది మేయర్లుగా నియమించింది. 2009 ఎన్నికలలో రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం పార్టీ తన ఎమ్మెల్యే అభ్యర్థిగా హిందూ అభ్యర్థి మురళీధర్‌రెడ్డిని బరిలోకి దించింది. గత మూడు పర్యాయాలుగా హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఎంఐఎం పార్టీ నుంచి ఐదు నుంచి ఆరుగురు హిందువులు కార్పొరేటర్లుగా ఎన్నికవుతున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆగాపురాలోని దారుస్సలాంలో ప్రతిరోజు ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కొలువుదీరుతారు. తమ నియోజకవర్గ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటుంటారు.
Siddaramai

సిద్దూకు తిలకం సెగ!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ట్విట్టర్‌లో తిలకం సెగ తగులుతున్నది. తనకు తిలకం పెట్టుకున్న వాళ్లం టే భయమని సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. పెద్దగా తిలకం పెట్టుకుని తీసుకున్న సెల్ఫీలను వారు సిద్దరామయ్య ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. రాజకీయ ప్రత్యర్థులు కూడా దీన్ని అందిపుచ్చుకున్నారు. బీజేపీ ఎంపీ శోభా కరండ్లజే ట్విట్టర్‌లో స్పందిస్తూ.. తిలకానికీ, రాజకీయాలకూ ఎలాంటి సంబంధంలేదు. తిలకం భారతీయ సంస్కృతిలో భాగం. దానికి నేను గర్వపడుతున్నాను అని పోస్ట్ చేశారు. సెల్ఫీ విత్ తిలక్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

టీఆర్‌ఎస్‌తో చెలిమి


trs1
తెలంగాణ ఆవిర్భావం తర్వాత భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని ప్రశంసించింది. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా బహిరంగ ప్రచారం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ మినహా 16స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు మజ్లిస్ పిలుపునిచ్చింది.

1181
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles