నలుగురు మంత్రులకు సమాధాన బాధ్యతలు


Thu,September 12, 2019 02:39 AM

four ministers-to-answer-questions-of cm kcr

-అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తరఫున జవాబు ఇవ్వనున్న
-వేముల, కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తరఫున సమాధానాలు చెప్పే బాధ్యతను నలుగురు మంత్రులకు అప్పగించారు. సీఎం కేసీఆర్ వద్ద ఉన్న ఆయాశాఖల తరఫున నలుగురు మంత్రులు సమాధానాలు చెప్పనున్నారు. రెవెన్యూశాఖను వేముల ప్రశాంత్‌రెడ్డికి, గనులు, భూగర్భ వనరులు, పౌరసంబంధాల శాఖలను కేటీఆర్‌కు, సాగునీటిపారుదల, శాంతిభద్రతలు, సాధారణ పరిపాలన శాఖలను హరీశ్‌రావుకు, వాణిజ్యపన్నుల శాఖను తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అప్పగించారు. ఆయా శాఖల కార్యదర్శులు పూర్తి సమాచారాన్ని సంబంధిత మంత్రులకు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది.

90
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles