సర్జరీ చేశాక పేషంట్ చనిపోయినా 17 లక్షల దవాఖాన బిల్లు !Fri,February 23, 2018 02:07 AM

-గుర్గావ్‌లో ఓ ప్రైవేటు హాస్పిటల్ దోపిడీ
-పోలీసులకు బాధితుడు ఫిర్యాదు

hospital
గుర్గావ్: మొన్న.. ఢిల్లీలో డెంగ్యూతో బాధ పడుతున్న చిన్నారి చికిత్సకు రూ.15.8 లక్షల బిల్లు వసూలు చేసిందో దవాఖాన. నిన్న.. గర్భంలోని కవలలను బతికించ డానికి శస్త్ర చికిత్స చేయాలంటే రూ.50 లక్షలు కావాలని, చివరకు ఇద్దరు చిన్నారులనూ పొట్టనబెట్టుకుంది మాక్స్ హాస్పిట ల్. కార్పొరేట్ దవాఖానల ధనదాహానికి ఉదాహరణలు అనేకం. సర్జరీ విఫలమై మహిళ చనిపోయినా, రూ.17లక్షల బిల్లు వసూలు చేసిన గుర్గావ్‌లోని ఓ దవాఖాన సంగతి వెలుగుచూసింది. వైద్యుల నిర్ల క్ష్యంతోనే తన తల్లి మరణించారని ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్‌లోని అల్వార్ వాసి సావిత్రీదేవి (67) అనారోగ్యంతో గతనెల 8న గుర్గావ్‌లోని కొలంబియా ఏషియా దవాఖానలో చేరారు. ఆమెను పరీక్షించిన వైద్యు లు పిత్తాశయంలోని రాళ్ల తొలిగింపునకు సర్జరీ చేయాలని అన్నారు. మరునాడే ఆమెకు శస్త్రచికిత్స చేశారని సావిత్రీదేవి తనయుడు రాజేంద్రసింగ్ తెలిపారు. తామెలాంటి శస్త్రచికిత్స చేయలేదని దవాఖాన డాక్టర్ చైతన్య పఠానియా చెప్పారు. 2017 ఆగస్టులోనే మ రో దవాఖానలో సావిత్రీదేవికి శస్త్రచికిత్స చేసి పిత్తాశయాన్ని తొలిగించారని, పిత్తవాహికలో చిక్కుకున్న ఒక్కరాయి తొలిగింపు నకు ఆమె చేరారని వైద్యులంటున్నారు. జనవరి 9న శస్త్రచికిత్స తర్వాత తన తల్లి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడినట్లు కుమారుడు తెలిపారు. మరో మూడు సర్జరీలు నిర్వహించిన వైద్యులు, తన తల్లిని ఐసీయూ లో ఉంచారని ఆరోపించారు. కానీ తీవ్రమైన గుండెనొప్పితో జనవరి 26న తల్లి మరణించినట్లు చెప్పారు. దీంతో ఆయన జనవరి 27న పాలంవిహార్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆరోగ్య శాఖ నివేదిక అందాక కేసు దర్యాప్తు చేపడతామని అధికారి విక్రమ్ నెహ్రా తెలిపారు.

1864

More News

VIRAL NEWS