సతాయిస్తున్నారు!


Thu,May 16, 2019 02:17 AM

former soldier wife Agitation For Land Registration

-మాజీ సైనికుడి భార్య ఆవేదన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశ రక్షణ కోసం పోరాడిన మాజీ సైనికుడి భార్యను. నా కుమారుడూ ఆర్మీ ఆఫీసరే. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం, చాకలిపల్లి గ్రామం మాది. నా తల్లిదండ్రులు పసుపుకుంకుమ కింద 1.9 ఎకరాల భూమిని 35 ఏండ్ల క్రితం దానపూర్వకంగా రిజిస్టర్ (డాక్యుమెంట్ నెంబర్ 2088/84) చేశారు. ఈ భూమి 298 (17 గుంటలు), 299/ఆ (16 గుంటలు), 387/ఆ (16 గుంటలు) సర్వే నంబర్లలో ఉన్నది. 35 ఏండ్ల నుంచి పట్టా నా పేరు మీదే ఉన్నది. పాత పాస్‌బుక్కులో ఈ నంబర్లు నమోదుచేశారు. ప్రస్తుతం నేనే కాస్తులో ఉన్నాను. భూప్రక్షాళన సమయంలో అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నాయని ఎమ్మార్వో సర్టిఫై చేశారు. మాన్యువల్ ఆర్వోఆర్ పాత దాంట్లో, కొత్త వాటిలో ఈ రోజుకు కూడా రెవెన్యూ రికార్డులు నా పేరిట ఉన్నాయి. కానీ, కొత్త పాస్‌బుక్కులో సర్వే నంబర్ 298 (17 గుంటలు) ని తొలిగించేశారు. అది సరి చేయమని కోరుతూ ఏడాది నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. వీఆర్‌వో, ఎమ్మార్వోలను సరి చేయమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఇప్పుడు చేస్తా.. అప్పుడు చేస్తా అంటూ కాలయాపన చేశారు. డిజిటల్ పని చేయడంలేదంటున్నారు.


టి. అలివేలమ్మ, హైదరాబాద్

పసుపు కుంకుమ కింద నా తల్లిదండ్రులు ఇచ్చిన భూమిని వేరేవారికి ఆర్వోఆర్‌లో నమోదుచేశారు. వాళ్లు కబ్జాలో కానీ కాస్తులో కానీ లేరు. ప్రజావాణిలో వనపర్తి జిల్లా కలెక్టర్‌కి రెండుసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. నా కుమారుడు చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు చేయగా.. 11 గుంటలు తిరిగి కేటాయించారు. పాస్‌పుస్తకంలో కూడా నమోదుచేశారు. మిగతా ఆరు గుంటల భూమి గురించి అడిగితే ఎమ్మార్వో కోర్టులో కేసు వేసుకోవాలని చెప్తున్నారు. రికార్డులను చూడకుండా, వాటిని సరిదిద్దకుండా, విచారణ చేయకుండా.. కోర్టుకు వెళ్లమనడం ఎంతవరకు కరెక్టు? ఏడాది నుంచి ఆఫీసుల చుట్టూ తిప్పిస్తున్నారు. కానీ, ఈ వృద్ధురాలి ఆవేదనను ఏ రెవెన్యూ అధికారి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ సమస్య వనపర్తి జిల్లా ఆర్డీవో ఆఫీసులో పెండింగులో ఉన్నది. పరిష్కారం కావడానికి ఇంకెంతకాలం పడుతుందోనని ఆందోళనగా ఉన్నది. మీ ధర్మగంట సేవలతో నాలాంటి నిస్సహాయురాలికి ఎంతో నమ్మకం కలుగుతున్నది. నా సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles