మాజీ ఎమ్మెల్యే మస్కతి కన్నుమూత


Tue,August 25, 2015 02:49 AM

former MLA Maskathi passes away

mla


-సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖుల సంతాపం
చార్మినార్: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి (85) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మస్కతి గత కొంతకాలంగా గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని, కొన్నిరోజులుగా కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మస్కతి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. పాతబస్తీకి చెందిన మస్కతి దివంగత సలావుద్దీన్ ఒవైసీ సారథ్యంలో ఎంఐఎంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనంతరం టీడీపీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. కాగా పలువురు ప్రముఖులు సోమవారం మస్కతి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ చార్మినార్ ఇన్‌చార్జి మీర్ ఇనాయత్ అలీ భాక్రీ, ఎస్‌ఏ ఖైసర్, టీడీపీ నేతలు కృష్ణాయాదవ్, మాగంటి గోపీనాథ్ తదితరులు మస్కతి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం విశ్రాంతి లేకుండా పోరాడిన ధీశాలి మస్కతి అని, ఆయన మరణం తీరని లోటు అని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. కాగా ఎంఐఎం పార్టీకి గట్టి పునాదులు వేసినవారిలో మస్కతి ఒకరని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీఅన్నారు. సాయంత్రం డీఆర్‌డీఎల్ సమీపంలో మస్కతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles