మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రావు కన్నుమూత


Sun,January 31, 2016 01:07 AM

Former MLA, Damodar Rao passes away

కొడిమ్యాల: కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ అనుబంధ పోతారం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జోగినిపల్లి దామోదర్‌రావు(80) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. జోగినిపల్లి దామోదర్‌రావు బుగ్గారం(ప్రస్తుత ధర్మపురి నియోజకవర్గం) నుంచి 1972-1977 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. జనతా పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీచేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గానికి అత్యధిక నిధులు మంజూరు చేయించుకొని, పనులు చేయించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన నేతగా పేరు సంపాదించారు.

మొదట్లో తిర్మలాపూర్ సర్పంచ్‌గా పని చేశారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సహకరించడంతోపాటు తిర్మలాపూర్ పంచాయతీ పరిధిలోని పోతారం, సంద్రాలపల్లి, దమ్మాయపేటకు కరెంటు రావడానికి ఎంతో కృషిచేశారు. పోతారంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనునట్లు బంధువులు తెలిపారు. ఆయనకు భార్య సరోజన ఉన్నారు. పిల్లలు లేకపోవడంతో తమ్ముడి కొడుకు హరీందర్‌ను దత్తత తీసుకున్నారు.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS